Google
Blog Promotion

Sunday, April 27, 2008

Crap#5..'అప్పిగాడు..వాడి వీసా'..telugu short story..


This is not my experience alone. I just borrowed the visa stamping experiences from my friends and many other people and compiled it as a story...Writing the story was easy but making it syntactically correct in Telugu was a big challenge. Thanks to the translation tool Lekhini (lekhini.org) and also to KK for suggesting it to me. It might just encourage people to write their stuff in Telugu.
After I'd completed the story, I didn't like it much. But I just posted it 'coz it could be a timepass for someone as bored as me.

అప్పిగాడు చిన్నపన్నించీ అంతే, అదో టైపు. ఎప్పుడు పక్కనొడు ఎం చెస్తే అదే చెయ్యలనె ఆలొచనే తప్ప, వాడికి కూడా కొన్ని సొంత అభిప్రాయాలు ఉంటాయి అన్న విషయం వాడికే తెలియదు. ఒక రోజు వీడి స్నేహితులంతా కలిసి విదేశాలకి వెళ్ళి అక్కడ బాగా డబ్బు సంపాదించి తిరిగి వస్తే మాంచి పెరు, ఇంకా మాంచి హోదా, అంతకంటె మంచి పెళ్ళాం వస్తుంది అని మాట్లాడుతుంటే ' ఇదెదో శివాజి సినిమా లొ హీరో ఎంట్రీ సీన్ లాగా ఉందే..' అని విన్నాడు.విని ఊర్కున్నాడా అంటే, లేదు. వాల్లతో పాటు పొలోమని H1B కి అప్ప్లై చెసాడు. అప్ప్లై చేసాక వీడి స్నేహితులు వీడికి 'ఒరేయ్ అప్పిగా..ఈ సారి లాటరి సిస్టం అంట రా..ఏమో మనకి డౌటే ' అని చెప్పారు. వీడు 'ఆ..మనకి వస్తే ఎంత రాకపొతే ఎంత..బొచ్చు లో వీసా ' అని తేలిగ్గా తీసిపారేసాడు, తెలుగు సినిమాల్లొ హీరొయిన్లు పాటల్లో బట్టలు తీసెసినట్టు.కాని లోలోపల మాత్రం, ఏమవుతుందొనని కొద్దిగా టెన్షన్ పద్దాడు.
తీరా ఒక నెళ్ళాళ్ళ తర్వాత చూస్తె వీడి ఖర్మ కాలి వీసా అప్లికేషన్ సెలెక్ట్ అయిపొవడము, అది అప్రూవ్ కూడ అయిపొవడము చక-చకా జరిగిపొయాయి. అదెదో కొన్ని సినిమాలు స్తార్ట్ అవ్వడము, షూటింగ్ జరగటము, రిలీస్ అవ్వటం, ఫ్లాప్ అయ్యి వెళ్ళిపొవటము జరిగినట్టు గా...
ఇక, తరువాతి ఘట్టం.
వీసా ఇంటర్వ్యుకి ప్రిపర్ అవ్వటం. వీడి మిత్రులు చెప్పిన దాని ప్రకారం, కన్సులేట్ వాళ్ళు అడిగె అక్షయ ప్రశ్నల్లొ ముఖ్యమైంది 'నీకు నేను వీసా ఎందుకివ్వాలి? అనే ప్రశ్న. ఇక వీడి మిత్ర బృందం ఈ ప్రశ్నకి ఎవడి పంథా లొ వాడు జవాబులు రెడీ చెసుకొవటం మొదలెట్టారు. నాకు వీసా ఇస్తే నేను US ఎకానమీని కాపాడుతానని ఒకడు, వీసా ఇస్తే మా కంపనీని వృద్ధి లోకి తెస్తానని ఇంకొకడు, ఇలా ఎవడికి తోచిన సమాధానాలతొ వాళ్ళు ప్రిపేర్ అయిపొయారు.
ఛివరికి ఆ రొజు రానె వచ్చింది. స్టాంపింగుకెళ్ళే రోజు..
మిత్రులంతా కలిసి విమానం లొ చెన్నై వెళ్ళి, అక్కడ ఒక హొటల్ లొ బస చెసారు. ఆ రాత్రంతా అప్పిగాడికి ఒకటె ఆలోచనలు, ఏం సమాధానం చెప్పాలి అని. భోజనం చెసి, డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయ లేదా అని చూస్కొని, ఇంక నిద్రకు ఉపక్రమించాడు. సరిగ్గా, అందరు నిద్రలోకి జారుకునే టైం కి హఠతుగా, అర్ధరాత్రి ఉలిక్కిపడి లెచాడు. అందరు వీడిని మొదట వింతగా చూసినా, తరువాత 'ఆ..ఈ అప్పిగాడు తేడా గాడు లెరా..ఎన్ని సార్లు చూడలెదూ?? ' అని సర్దుకున్నారు. కాని వాళ్ళకేం తెలుసు అప్పిగాడికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది అని? ఆ ఐడియా జీవితాన్నే మార్చెస్తుందని? ఇంక అప్పిగాడు ఉరకలెత్తిన ఉత్సాహం తొ పెందళాడె లేచి, తలారా స్నానం చెసి, తన ఇష్ట దైవం అయిన తిరుపతి వెంకన్నకి దణ్ణమెట్టుకొని, మాంచి దొర బాబు లాగ రెడీ అయ్యి,కాన్న్సులేట్ కి బయల్దెరాడు. అక్కడికెళ్ళి చూస్తె చాంతాడంత లైను ఉంది. పొరపాటున ఎదైనా రజినికాంత్ కొత్త సినిమా ఆడుతున్న థియేటర్‌కి వచ్చామ అని కాసెపు నివ్వెరపొయారు అప్పిగాడు, వాడి మిత్ర బృందమూను. కాని అక్కడ సూటూ, బూటూ వేసుకొని ఒచ్చిన జనాలను చూసి, రజినికాంత్ సినిమాలకు లుంగీలు కట్టుకున్న మేస్త్రీలు వస్తారు గాని ఇలా ఇస్త్రీ బట్టలేసుకున్న వాళ్ళు రారు అని అప్పిగాడు వాళ్ళకి జ్ఞానొదయం చెయ్యడంతొ, ఇక ఇది కాన్సులటే అని నిర్ధారణకి వచారు అప్పిగాడి మిత్రబృందం. ఇంక లైనులో నిలుచుని, లోపలికి వెళ్ళె సరికి పొద్దున్నే తిన్న ఆ కాస్త ఉప్మా కూడా గాల్లో కలిసి పొయింది అప్పిగాడి మిత్ర బృందానికి.
లోపలికెళ్ళాక, అప్పిగాడి మిత్ర బృందం లోంచి ఒక్కొకరు ఒక్కో ఆఫీసర్ దగ్గరికెళ్ళరు. ఇక, మన అప్పిగాడెమో ఒక తెల్లగా పొడుగ్గా ఉన్న తెల్ల దొర దగ్గరికెళ్ళాడు. లైను లొ వీడికి ముందు ఒక నల్ల చీర కట్టుకున్న అమ్మాయి ఒకర్తి ఇంటర్వ్యు కోసం వెయిట్ చేస్తోంది. అప్పిగాడికి, సహజంగానె నల్ల చీర కట్టుకున్న అమ్మాయిలంటే బాగా అభిమానం.అందరికీ తెల్ల చీర కట్టుకున్న అమ్మాయిలంటె ఇష్టం. కానీ వీడికి మాత్రం నల్ల చీరంటేనె ఇష్తం. వాడంతె, అదో టైపు. వాడికి ఊహ తెలిసి, వాడికి వయసొచ్చాక నల్ల చీర కట్టుకున్న అమ్మాయిని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటి సారి. ఆ అమ్మాయి తన వంతు రావటంతో క్యూ లొ నుండి వెల్లిపోయి ఆఫీసరు గాడి తిక్క ప్రశ్నలకు ముద్దు ముద్దు గా సమాధానలు ఇస్తొంది. 'అబ్బా..ఎంత ముద్దు గా ఉంది ఈ పిల్లా అనుకుంటూ వీడు ఆ అమ్మయిని అదే పనిగా చూస్తూ మైమరచి ఒక్క క్షణం పాటు అమెరికా కెళ్ళి ఒక రెండు మూడూ డ్యుయెట్లు 'నల్ల చీర కట్టుకున్నదెవరి కొసమో..' అని పాడుకొని వచ్చేసాడు.
చివరికి ఆ తెల్లతోలు ఆఫీసరు వీడిని 'రారా..' అని పిలిచాడు. చంద్రముఖి సినిమా టైపులో.వీడు ఆ నల్ల చీర అమ్మాయి గోల లో పడి ఈ తెల్ల తోలు వడి పిలుపుని పట్టించుకొలెదు. దనితొ వాడు 'ఎరా.. వెర్రి పీనుగా..సహార ఎడారిలో స్వెట్టర్ తొడుక్కొని తిరిగే వాడిలా అలా చచ్చు మొహమేసుకొని చూస్తావేర? ఇక్కడికి నువ్వొచింది అమ్మాయిల్ని చూసి సొల్లు కార్చుకోడానిక..లేక వీసా తెచ్చుకొడానికా?' అన్నట్టు ఒక చూపు చూసాడు. దాంతొ మనోడికి ఒంట్లొ వణుకు స్టార్త్ అయ్యింది.
అప్పిగాడిని ఆఫీసర్ అందరినీ అదిగే ప్రశ్నే అదిగాడు 'నెను నీకు వీసా ఎందుకివ్వాలంటా?' అని.అందరిలా బుద్ధిగ చెప్తే అప్పిగాడు తేడా గాడు ఎందుకవుతాడు? అందుకే ఇలా చెప్పాడు:'నాకో చిన్న కల ఉండేది. నేను మైక్రోసాఫ్ట్, సియాటిల్ ఆఫీసులో ప్రాజెక్టు మేనేజర్ని అయ్యాక, బిల్ గేట్స్తొ బోర్డు మీటింగు లో ఉంటె, ఒక తెల్లని అమ్మాయి నల్లని రంగు చీర లో బయట నాకొసం వెయిట్ చెస్తుంటే..ఆ చూపులు నన్ను తడిమి..ఎందుకో అటువైపు చూస్తె నా పెళ్ళాం.. ఆమెతో పాటు వందలాది మంది జనం. జగన్ కోసం జనం ప్రోగ్రాం కి వచ్చినట్టుగా. అప్పుదు నెను గేట్స్ తొ ' గేట్సూ...గేటు అవతల నా మేట్ నా కోసం వెయిట్ చెస్తోందీ అని చెప్పి బయటకు వస్తే 'ఎవండీ..మీరు Best Software Engineer of the Year గా సెలక్ట్ అయ్యారూ అని నా భార్యామణి చెప్తుంది. అప్పుడు నా కష్టానికి తగిన ఫలితం దొరికిందన్న సంతోషం తో నేను ఉబ్బి తబ్బిబ్బై పొతాను..అప్పుడు అప్రయత్నంగా రెండు కన్నీటి చుక్కలు అలా జారతాయ్....అంతే '.ఆ ఆఫీసర్ వీడిని 'సొల్లు కబుర్లు చెప్పకేం..' అన్నట్టు చూసి, ఎవో డాక్యుమెంట్స్ అడిగాడు. అప్పిగాడికి ఒకటే టెన్షన్. స్టోరీ అంతా సొల్లు అని వాడికి అర్థమై పోయి వీడికి వీసా ఇవ్వడేమోనని..కానీ వీడి అదృష్టమో..లేక అమెరికా వళ్ళ ఖర్మో....లేక ఆ అమెరికా వాళ్ళకి వీడిలాంటి తేడా గాళ్ళె కావాలో..నారు పొసిన వాడే నీరు కూడా పొస్తాడు అన్న చందాన, అప్ప్లికేషన్ అప్రూవ్ చేసిన ఆ అమెరికా వాడికే అప్పిగాడికి వీసా కూడా ఇవ్వక తప్పింది కాదు. అప్పిగాడికి వీసా ఇస్తున్నట్టు చెప్పగానే అప్పిగాడి అనందానికి అవధుల్లేకుండా పొయాయి. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిలిం ఇండుస్ట్రీకొచ్చిన కొత్త హీరో సినిమా హిట్టైతె ఎంత ఉప్పొంగిపొతాడో, అంత కంటె పదింతలు ఎక్కువే అనందపడ్డాడు..
ఇక తర్వాతేం పీకాలొ వీడికి ఇప్పటికి ఐడియా లెదు..

తర్వాత ఏం చేస్తాడు? ఏమో వాడికేం తెల్సు...?

వాడి గ్యాంగ్ ఇంకా డిసైడ్ చేస్కోలేదుగా మరి..!

0 comments:

 
eXTReMe Tracker